America Road Accident : అమెరికాలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి
భారతదేశం, ఆగస్టు 26 -- అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్‌గా గుర్తించారు.
రాహుల్‌తోపాటు మిగిలిన ఇద్దరు కూడా ఉన్నత విద్య కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫ్లోరిడా అధికారులు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాహుల్ అకాల మరణం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త రాహుల్ స్వగ్రామంలోనూ విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by HT Digital Conte...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.