భారతదేశం, ఏప్రిల్ 25 -- Ameesha Patel Regrets Of Bhumika Role: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో 'తేరే నామ్' ఒకటి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. రాధే పాత్రలో సల్మాన్ ఖాన్ నటన, ఆ హెయిర్ స్టైల్, హిట్‌ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక చావ్లాకు అది తొలి హిందీ సినిమా. కానీ, నిజానికి ఈ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ మొదట అనుకున్నది భూమికను కాదు. అప్పట్లో స్టార్ ఇమేజ్‌తో తెగ క్రేజ్‌లో ఉన్న అమీషా పటేల్‌ను. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీషా పటేల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నట్లు పేర్కొన్నారు.

అమీషా పటేల్ మాట్లాడుతూ.. "తేరే నామ్ సినిమాను మిస్ చేసుకోవడం నా కెరీర్‌లో ఒక పెద్ద వెలితి. సల్మాన్ నాకు కథ చెప్పినప్పుడు క...