భారతదేశం, మే 13 -- ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాకు చెందిన 'అమెజాన్ బజార్' తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదరణ భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 4 రెట్లు పెరిగిందని అమెజాన్ బజార్ ఇండియా హెడ్ సమీర్ లల్వానీ వెల్లడించారు.

ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్‌లో అమెజాన్ బజార్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోంది. మంగళవారం విలేకరుల సమావేశంలో లల్వానీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్తగా సైన్-అప్ అవుతున్న కస్టమర్ల సంఖ్యలో 4 రెట్లు వృద్ధి నమోదైందని తెలిపారు. కేవలం 2026 సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్ మార్కెట్‌లో ఆరు రెట్లు వృద్ధిని సాధించామని ప్రకటించారు. 2024...