భారతదేశం, మే 7 -- Tejesh Rajan Amaram Teaser Released: కోలీవుడ్‌లోకి మరో హీరో అడుగుపెడుతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలోకి తేజేష్ రాజన్ హీరోగా అడుగుపెడుతున్నాడు. తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం అమరం. ఈ సినిమాకు తిరువరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అమరం చిత్రం తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో అరమం టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.

వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్...