భారతదేశం, అక్టోబర్ 1 -- Amala Paul About Nude Scene In Aame Movie: చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు నటీనటులకు నటన పరంగా గొప్ప పేరు తెచ్చిపెడితే, మరికొన్ని సినిమాలు వారి కెరీర్‌లోనే పెద్ద సాహసాలుగా మిగిలిపోతాయి. అలాంటి విభిన్నమైన ప్రయత్నమే హీరోయిన్ అమలా పాల్ చేసిన 'ఆడై' (తెలుగులో 'ఆమె').

2019లో విడుదలైన ఈ ఆమె చిత్రంలో ఒక కీలక సన్నివేశం కోసం అమలా పాల్ నగ్నంగా నటించి అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సినిమా విశేషాలను, ఆ సమయంలో తాను పడిన మానసిక మథనాన్ని అమలా పాల్ పంచుకున్నారు.

'ఇండియా టుడే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ మాట్లాడుతూ.. 'ఆడై' కథ విన్నప్పుడు మొదట తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని తెలిపారు. "ఈ సినిమాలో న్యూడ్ సీన్ కథాక్రమంలో భాగమా? లేక కేవలం ప్రచారం కోసం వాడుకుంటున్నారా? అనే సందేహం నన్ను వేధించింది" ...