భారతదేశం, మార్చి 9 -- గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) విడుదలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'తో బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇష్టం లేక అలియా భట్ తన సినిమాను వాయిదా వేసుకున్నారని కామెంట్స్ వచ్చాయి.

అంతేకాకుండా ఆల్ఫా సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సోమవారం (మార్చి 9) ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

తాజాగా ఆల్ఫా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం 'ఆల్ఫా' చిత్రం జూలై 10, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని అనుకున్నారు. కాన...