భారతదేశం, మార్చి 14 -- టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు అల్లు శిరీష్. అయితే ఆ పెళ్లి వేడుకల కంటే, అల్లు శిరీష్ ధరించిన ఆభరణాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అల్లు శిరీష్ విభిన్నమైన నెక్లెస్‌లు (నగలు), చోకర్లు ధరించడంపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై శిరీష్ స్పందిస్తూ.. ఫ్యాషన్ విషయంలో తనకున్న స్పష్టతను, ధైర్యాన్ని చాటుకున్నారు.

తన ఫ్యాషన్ సెన్స్‌పై వస్తున్న విమర్శలను అల్లు శిరీష్ ఏమాత్రం పట్టించుకోలేదు. "ఏది మగతనం? ఏది ఆడతనం? అని ఇతరులు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏం ధరించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను" అని అల్లు శిరీష్ ఖరాకండిగా చెప్పారు. మగవార...