భారతదేశం, ఆగస్టు 10 -- Allu Arjun Fans Chase His Car In Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకతో విశాఖపట్నం సముద్ర తీరం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. నగరంలోని ఇనార్బిట్ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బన్నీకి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.

అభిమానుల రద్దీతో బీచ్ రోడ్డు ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి బీచ్ రోడ్డు మీదుగా ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే దారిపొడవునా అభిమానులు పండగ వాతావరణం సృష్టించారు. అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను వందలాది మంది అభిమానులు బైక్‌లపై ఛేజ్ చేస్తూ అనుసరించారు.

అభిమానుల ఉత్సాహాన్ని చూసిన అల్లు అర్జున్ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వైజాగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన...