భారతదేశం, ఏప్రిల్ 8 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే కానుకగా ఈ చిత్రానికి 'రాకా' (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "ఇది కేవలం సినిమా కాదు, నాలో ఒక భాగం. దాదాపు 18 ఏళ్లుగా ఈ ఐడియాను నా మనసులోనే దాచుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ కథ రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే," అంటూ అట్లీ తన ఆనందాన్ని పంచుకున్నారు.

రాకా పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ అత్యంత భయంకరంగా, ఊహకందని విధంగా ఉంది. కళ్లకు దట్టమైన కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో బన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అన్నింటికంటే ముఖ్యంగా, అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు తరహాలో ఉండ...