భారతదేశం, జూన్ 9 -- Allu Arjun Peddi Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. గత బుధవారం (జూన్ 3) రాత్రి పెయిడ్ ప్రీమియర్స్, గురువారం (జూన్ 4) పూర్తిస్థాయి విడుదలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా సోమవారం (జూన్ 8) రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ది సినిమాను వీక్షించారు. సినిమా చూసిన వెంటనే ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పెద్ది రివ్యూ ఇస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు అల్లు అర్జున్. సినిమాలో రామ్ చరణ్ మేకోవర్, యాక్టింగ్ శైలిపై అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

"గత రాత్రి 'పెద్ది' సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ...