భారతదేశం, జూలై 14 -- Alia Bhatt Tumbbad 2: సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత భయంకరమైన 'హస్తార్' ప్రపంచం మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 2018లో విడుదలైన 'తుంబాడ్' సృష్టించిన విజువల్ వండర్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'తుంబాడ్ 2' లో అలియా భట్ వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది.

సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ సీక్వెల్ తుంబాడ్ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో అలియా భట్ ఎంట్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా నటిస్తున్న సోహుమ్ షా ఈ ప్రకటన చేశాడు. అలియా భట్ ఫస్ట్ టైమ్ ఓ హారర్ థ్రిల్లర్ చేస్తోంది.

తుంబాడ్ మొదటి భాగాన్ని చాలా పరిమిత బడ్జెట్‌తో వర్షం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. కానీ 'తుంబాడ్ 2' ను ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో...