భారతదేశం, మార్చి 16 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ తన 33వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్' (Eternal Sunshine) చిన్నారుల వినోద రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. 'ఎటర్నల్ కిడ్స్' (Eternal Kids) పేరుతో ప్రారంభించిన ఈ కొత్త విభాగం ద్వారా పిల్లల కోసం అద్భుతమైన కథలను తీసుకురాబోతున్నారు.

తాతయ్యకు ప్రేమతో..

ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. 2023 జూన్‌లో కన్నుమూసిన తన తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ సృష్టించిన పాత్రలు, ఆయన రాసిన కథలే ఈ 'ఎటర్నల్ కిడ్స్'కు పునాది అని అలియా భట్ వెల్లడించారు. తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి చిన్నప్పుడు తాతయ్య దగ్గర విన్న కథలను ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు అలియా భట్ భావోద్వేగంతో చెప్పుకొ...