భారతదేశం, మార్చి 30 -- బాలీవుడ్ యాక్షన్ స్టార్, అందరూ ప్రేమగా పిలుచుకునే 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత పంథాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి తరం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వీఎఫ్ఎక్స్ (VFX) వాడకం పెరిగిపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని చేసే యాక్షన్ కంటే, ప్రాణాలకు తెగించి చేసే ఒరిజినల్ స్టంట్స్‌లోనే అసలైన మజా ఉంటుందని 58 ఏళ్ల ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్, కన్నప్ప శివుడు స్పష్టం చేశారు.

కరాటే, ముయ్ థాయ్, టైక్వాండో వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరిన అక్షయ్ కుమార్, పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం యాక్షన్ సినిమాలు తీసే విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫైట్స్ అన్నీ సహజంగా ఉండేవి. ఇప్పుడు అంతా వీఎఫ్ఎక్స్ మయం అయిపోయింది. ఇది చూడటానిక...