భారతదేశం, అక్టోబర్ 2 -- Akshara Haasan About High School Fail And Direction: సినిమా పరిశ్రమలో స్టార్ కిడ్స్ ప్రయాణం అనగానే అందరూ పూలబాట అని అనుకుంటారు. కానీ, వారి వెనుక ఎన్నో రకాల సవాళ్లు, సొంత నిర్ణయాలు ఉంటాయి. లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారికల చిన్న కుమార్తె, శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఇటీవల సైరస్ బ్రూచా పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకున్నారు.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, తన ప్రయాణం ఎంతో భిన్నంగా సాగిందని అక్షర వివరించారు. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలు నేరుగా హీరోలుగా లేదా హీరోయిన్లుగా పరిచయమవుతుంటారు. అక్షర మాత్రం తన ప్రయాణాన్ని కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించారు. మొదట స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు ఆమె తెలిపారు.

"నా మొదటి ఉద్యోగం నటన కాదు, అసి...