భారతదేశం, జూలై 6 -- Akriti Agarwal Comments On Prithvi Shaw: సెలబ్రిటీల జీవితాల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, ఆపై వచ్చే మనస్పర్థలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే యంగ్ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు కొత్త తుఫాను మొదలైనట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాది మార్చి నెలలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ బంధంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు జోరందుకున్నాయి. ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పెట్టిన కొన్ని పోస్టులు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'త్రిముఖ' సినిమాలో నటించిన ఆకృతి అగర్వాల్, పృథ్వీ షా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ సంతోషపడేలోపే ఈ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఆదివారం (జూలై 5) ...