భారతదేశం, జూలై 3 -- Akhil Akkineni Praised Samantha Maa Inti Bangaaram: టాలీవుడ్‌లో నటీనటుల మధ్య ఉండే ప్రొఫెషనల్ బాండింగ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకరి విజయాలను మరొకరు అభినందించుకుంటూ ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చాటుతుంటారు.

తాజాగా అక్కినేని యువ హీరో అఖిల్, స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'మా ఇంటి బంగారం' సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన కొత్త సినిమా ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, సమంత సాధించిన విజయాన్ని అఖిల్ ప్రత్యేకంగా అభినందించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జులై 10న లెనిన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా...