భారతదేశం, జూలై 10 -- Akkineni Akhil On Nagarjuna Hello Brother Remake: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ 'హలో బ్రదర్' సినిమాను రీమేక్ చేయడంపై అక్కినేని అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కమెడియన్ గెటప్ శ్రీనుతో కలిసి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుందంటూ సరికొత్త లైన్ గీశారు ఈ లెనిన్.

1994లో గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' సినిమా ఎంతో ఘన విజయం సాధించడమే కాకుండా నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దేవా, రాజా అనే ద్విపాత్రాభినయంలో నాగార్జున పండించిన మాస్ కామెడీ, వినోదం ప్రేక్షకులను ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూనే ఉన్నాయి.

అక్కినేని వారసుల్లో ఎవరైనా ఈ సినిమాను రీమేక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బలంగా కోరుకుంటున్నారు. అయితే...