భారతదేశం, జూన్ 28 -- TV Pair Akanksha Gaurav Divorce Announcement In OTT Show: బుల్లితెరపై మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ గత సీజన్ 19 విజేత గౌరవ్ ఖన్నా, నటి ఆకాంక్ష చమోలా వైవాహిక బంధం ముగింపు దశకు చేరింది.

తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ ఆకాంక్ష చేసిన అధికారిక ప్రకటన హిందీ టెలివిజన్ రంగంతో పాటు సోషల్ మీడియా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్‌గా ప్రారంభమైన పాపులర్ ఓటీటీ బోల్డ్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2 వేదికగా ఆమె ఈ సంచలన నిజాన్ని బయటపెట్టారు.

'లాక్ అప్ 2' షోలో ఆకాంక్ష చమోలా ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఓటీటీ షో ప్రీమియర్ ఎపిసోడ్‌లో హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆకాంక్ష తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని పంచుకున్నారు. తాము ...