భారతదేశం, నవంబర్ 1 -- AIIMS Mangalagiri Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ / సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాలు గరిష్ఠంగా 3 ఏళ్ల కాలానికి (రెస్సిడెన్సీ స్కీమ్ కింద) తాత్కాలిక ప్రాతిపదికన జరుగుతాయి. ప్రతి సంవత్సరం అభ్యర్థి పనితీరును సమీక్షించి గడువును పొడిగిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2026 నవంబరు 21వ తేదీ శనివారం లోపు ఆన్‌లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత వైద్య విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎండ...