భారతదేశం, జూన్ 8 -- AIIMS Bibinagar Recruitment 2026 : బీబీ నగర్‌లో ఉన్న ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, రేడియో-డయాగ్నోసిస్, అనాస్తీషియాలజీ వంటి దాదాపు 30కి పైగా వైద్య విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

మెడికల్ అభ్యర్థులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం కింద గుర్తింపు పొందిన ఎంబీబీఎస్‌తో ప...