భారతదేశం, అక్టోబర్ 24 -- ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ నుంచి ఎండీ, ఎంఎస్ , డీఎన్‌బీ (DNB), డీఎం లేదా ఎంసీహెచ్ (M.Ch) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని నిర్దిష్ట నాన్-మెడికల్ విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీతో పాటు పీహెచ్‌డీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్...