భారతదేశం, మే 23 -- Hyderabad Police AI Copwriter : హైదరాబాద్ మహానగర పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా.. వారి ఫిర్యాదులను త్వరితగతిన, పక్కా కచ్చితత్వంతో నమోదు చేసే దిశగా అడుగు ముందుకేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా 'ఏఐ కాప్‌రైటర్' (AI CopWriter) అనే కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) లో శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ వినూత్న యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దాని పనితీరును స్వయంగా పరిశీలించారు.

హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ మెట్రో నగరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ...