భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయన్నది ఇప్పుడు కేవలం ఊహాగానం కాదు.. కళ్లముందు కనిపిస్తున్న చేదు నిజం. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆటోమేషన్‌ను వేగవంతం చేస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ప్రొఫెషనల్స్ ఒక్కసారిగా రోడ్డున పడుతున్నారు. ఒకప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగం అంటే జీవితాంతం భరోసా అనుకునే వారు, ఇప్పుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

2026 తొలి త్రైమాసికంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 97 టెక్ కంపెనీలు 81,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.

అమెజాన్, మెటా, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అంటే, ఏ కంపెనీలోనూ ఉద్యోగం శాశ్వతం కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉద్యోగాల కోత వెనుక గుండె కోత మిగిల్చే కథలు ఎన్నో ఉన్నాయి. నోయిడాలో ఏడాదికి రూ. 40 లక్షల...