భారతదేశం, నవంబర్ 1 -- తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారత సైన్యం గొప్ప అవకాశం కల్పించింది. 2027 రిక్రూట్‌మెంట్ సంవత్సరానికి గాను అగ్నివీర్ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ ప్రకటించింది.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రసిద్ధ జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వేదికగా నవంబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులందరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.

ఈ ర్యాలీ ద్వారా నాలుగు వేర్వేరు విభాగాలలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ - 10వ తరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ - 8వ తరగతి ఉత్తీర్ణత పోస్టులు ఉన్నాయి.

అగ్నివీర్ నియామక ర్యాలీకి సంబంధించి ఇ...