Adilabad RIMS Fire Accident : ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం - ఇద్దరు చిన్నారులు మృతి
భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల భాగంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నిప్రమాదం కారణంగా ఐదు రోజుల వయసున్న పసికందు ఊపిరాడక, తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలిసింది.
ఘటన సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది, అత్యవసర రక్షణ బృందాలు సకాలంలో స్పందించి సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రాణనష్టం తక్కువతో ముగిసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో చిన్నపిల్లల వార్డులో (NICU/పిడియాట్రిక్ వార్డు) ఉన్న ఎయిర్ కండిషనర్ విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షార్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.