భారతదేశం, మే 28 -- Shahana Goswami About Open Relationships: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమ వ్యవహారాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. కొందరు తమ బంధాలను సీక్రెట్‌గా ఉంచడానికి ఇష్టపడితే, మరికొందరు మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు.

'రాక్ ఆన్', 'హీరోయిన్', 'జ్విగాటో' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షహానా గోస్వామి తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సంచలన నిజాలు పంచుకున్నారు. సమాజం నిర్ణయించిన సాంప్రదాయ ప్రేమ సూత్రాలు తనకు అస్సలు సరిపోవని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రముఖ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షహానా గోస్వామి తన డేటింగ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఒకప్పుడు మోడల్, పాపులర్ నటుడు మిలింద్ సోమన్‌తో నడి...