భారతదేశం, ఆగస్టు 24 -- Actress Anangsha Biswas About Vulgar Messages: డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటీటీ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'. ఈ ఓటీటీ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనంగ్షా బిస్వాస్ (Anangsha Biswas). ఈ పొలిటికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో రాజకీయం, గ్లామర్‌ను ఉపయోగించి ఎదిగే 'జరీనా' అనే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు.

ఇప్పుడు ఇదే కథ వెండితెరపై 'మీర్జాపూర్: ది మూవీ' రూపంలో రానున్ విషయం తెలిసిందే. అయితే, స్క్రీన్‌పై తాను పోషించిన బోల్డ్ క్యారెక్టర్ వల్ల నిజ జీవితంలో తీవ్రమైన వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ బెంగాలీ భామ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

హిందీ రష్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంగ్షా మాట్లాడుతూ.. మొదటి సీజన్ విడుదలైన తర్వాత తన ఇన్ బ...