భారతదేశం, అక్టోబర్ 3 -- Komal Rani Swarnkar About Govinda Rumours: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, యంగ్ బ్యూటీ కోమల్ రాణి స్వర్ణకార్ చుట్టూ గత కొద్దిరోజులుగా అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా గణపతి దర్శనానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ వివాదం ఒక్కసారిగా ముదిరింది.

ఆ సమయంలో రాణి పాపిట సిందూరం కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. తాజాగా బాలీవుడ్ నటి, దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్ పరోక్షంగా రాణిని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ వరుస పరిణామాలపై తాజాగా నటి రాణి స్వర్ణకార్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నోరు విప్పారు. తమ వ్యక్తిగత జీవితంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్న సెలబ్రిటీలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో జరిగే తీవ్రమైన సమస్యలపై నోరు మెదప...