Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటుడు మహేష్ దుర్మరణం- 1000 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన వాహనం- 8 మంది యువకులు మృతి
భారతదేశం, మే 28 -- Serial Actor Mahesh Pawar Died In Road Accident: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ సమాధయ్యారు. ముంబైకి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గఢ్ జిల్లా పరిధిలోని అంబెనాలి ఘాట్ సెక్షన్లో ఈ దారుణం జరిగింది.
మృతుల్లో మరాఠీ బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే 'అప్పీ ఆమ్చీ కలెక్టర్' సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా ఉండటంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మృతులంతా 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న యువకులే. వీరంతా సతారా, రత్నగిరి జిల్లాలకు చెందిన స్నేహితులు. ఆదివారం (మే 24) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.