భారతదేశం, మే 28 -- Serial Actor Mahesh Pawar Died In Road Accident: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ సమాధయ్యారు. ముంబైకి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గఢ్ జిల్లా పరిధిలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ దారుణం జరిగింది.

మృతుల్లో మరాఠీ బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే 'అప్పీ ఆమ్చీ కలెక్టర్' సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా ఉండటంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మృతులంతా 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న యువకులే. వీరంతా సతారా, రత్నగిరి జిల్లాలకు చెందిన స్నేహితులు. ఆదివారం (మే 24) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలో...