భారతదేశం, మే 3 -- AC Safety Tips Telugu : మండుతున్న ఎండల నుంచి ఇంటికి రాగానే ఏసీ ఇచ్చే చల్లని గాలి మన అలసటను తీరుస్తుంది. కానీ... అదే ఏసీ మన అజాగ్రత్త వల్ల పేలిపోతే? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలోని వివేక్ విహార్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మనల్ని భయపెడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చిన్నారులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏసీ పేలుతుందా..? దానికి గల సాంకేతిక కారణాలేంటి..? మనం చేయకూడని తప్పులేవో ఇక్కడ చూద్దాం..

సాధారణంగా ఏసీ పేలుడు అనేది ఒక్క క్షణంలో జరిగేది కాదు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సాంకేతిక లోపాలు, 'ఓవర్ హీటింగ్' (అధికంగా వేడెక్కడం) లేదా విద్యుత్ లోపాలు దీనికి ప్రధాన కారణం. అవుట్ డోర్ యూనిట్‌కు గాలి ఆడే సౌకర్యం లేకపోవడం, ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల వేడి బయటకు వెళ్లలేక యూనిట్ లోపల ఒత్త...