భారతదేశం, ఆగస్టు 15 -- Aaradhya Bachchan Case Delhi High Court: ప్రముఖ బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిగత హక్కులు) కేసుపై ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఆరాధ్య ఆరోగ్యంపై, ఆమె వ్యక్తిగత జీవితంపై యూట్యూబ్‌లో వస్తున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరుతూ 2023లో దాఖలైన ఈ పిటిషన్‌పై జస్టిస్ అనూప్ జే భాంబానీ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

విచారణ సమయంలో న్యాయమూర్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (మేధో సంపత్తి హక్కులు) కోణంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. సాధారణంగా ఒక వస్తువు లేదా సేవకున్న ప్రతిష్ట ఆధారంగా ట్రేడ్‌మార్క్ విలువ ఆధారపడి ఉంటుందని, కానీ ఒక వ్యక్తి లేదా కుటుంబం విషయానికి వస్తే ఇది భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

"సమాజంలో ఒక కుటుంబం సాధించిన విజయాలు, ...