భారతదేశం, మార్చి 15 -- బాలీవుడ్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజును (మార్చి 14) ఎంతో ఆత్మీయంగా, తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఇంట్లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.

ఈ వేడుకలో అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో పాటు ఆయన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్, ఆజాద్ రావు ఖాన్ సందడి చేశారు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ తన భార్య సఫా బేగ్‌తో కలిసి ఈ విందుకు హాజరయ్యారు. ఈ వీడియోలో అమీర్ ఖాన్ చాలా సింపుల్‌గా స్ట్రిప్డ్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో కనిపించగా.....