భారతదేశం, జూన్ 3 -- Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వార్త ఇప్పుడు బి-టౌన్‌లో సెన్సేషన్‌గా మారింది. బుధవారం (జూన్ 3) ప్రముఖ మీడియా సంస్థ 'హాటర్‌ఫ్లై' (Hauterrfly) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం.. ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఈ ఏడాది జులైలో అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.

బాలీవుడ్ స్టార్ వెడ్డింగ్ అనగానే భారీ హంగామా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ గుర్తొస్తాయి. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించి అత్యంత నమ్మకమైన వర్గాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పెళ్లి జులై 5న జరగనుంది.

ఎలాంటి హడావుడి లేకుండా, అత్యంత సింపుల్‌గా ఇంట్లోనే కేవలం రిజిస్టర్డ్ మ్యారేజ్ పద్ధతిలో చేసుకోనున్నారు. ఈ ప్రైవేట్ ఫంక్షన్‌కు రెండు కుటుంబాల సభ్యులతో పాటు,...