భారతదేశం, ఆగస్టు 28 -- Aakali Rajyam 2026 Review In Telugu And Rating: 1980వ సంవత్సరంలో దర్శకదిగ్గజం కే.బాలచందర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆకలి రాజ్యం' సినిమా నాటి నిరుద్యోగుల గుండె చప్పుడుగా నిలిచింది. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత, అదే సమస్యను నేటి ఐటీ విప్లవం, యూత్ లైఫ్‌స్టైల్ నేపథ్యానికి ముడిపెడుతూ 'ఆకలి రాజ్యం 2026' పేరుతో కొత్త ఓటీటీ సిరీస్‌ను తీసుకొచ్చారు.

ఆకలి రాజ్యం 2026 వెబ్ సిరీస్‌కు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. తెలుగు సోషల్ సెటైరికల్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆకలి రాజ్యం 2026 ఓటీటీ సిరీస్‌లో వికాస్ వశిష్ఠ, గీతా సైనీ, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

నేటికి తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎలా ఉందనే కాన్సెప్టుతో వచ్చిన ఆకలి రాజ్యం 2026 ఆహాలో ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతానికి 3 ఎపిసో...