భారతదేశం, ఆగస్టు 23 -- పిల్లల ఆధార్ వివరాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన బయోమెట్రిక్ అప్‌డేట్‌ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు, సంరక్షకులు వీలైనంత త్వరగా సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వారి చేతి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్)లో మార్పులు వస్తాయి. మొదటిసారి ఆధార్ నమోదు చేసే సమయంలో ఐదేళ్లలోపు పిల్లలకు కేవలం డెమోగ్రాఫిక్ వివరాలు (పేరు, చిరునామా, పుట్టిన తేదీ), ఫోటో మాత్రమే తీసుకుంటారు.

ఐదేళ్లు నిండిన వెంటనే పిల్లల మొదటి బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, ఐరిస్, కొత్త ఫోటో) ఆధార్‌లో నమోదు చేయడం త...