భారతదేశం, మే 19 -- ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన దారి కోసం వెతుకుతుంటారు. అయితే, 2026 ఫిబ్రవరిలో మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం ఊహించని విధంగా ఒక రంగం పాలిట వరంగా మారింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' మూతపడటంతో, ముడిచమురును సముద్రం ద్వారా రవాణా చేసే ఖర్చులు (Freight Rates) చుక్కలనంటాయి. ఈ పెరిగిన ఛార్జీలను క్యాష్ చేసుకునే 'బ్రేక్‌వేవ్ ట్యాంకర్ షిప్పింగ్ ఈటీఎఫ్' (BWET) కేవలం ఈ ఏడాదిలోనే 860 శాతం లాభాలను నమోదు చేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా ఎనర్జీ ఈటీఎఫ్‌లు ముడిచమురు ధరల ఆధారంగా పనిచేస్తాయి. కానీ, BWET పంథా వేరు. ఇది చమురు ధరలపై కాకుండా, చమురును రవాణా చేసే ట్యాంకర్ల 'ఫ్రైట్ ఫ్యూచర్స్' (Freight Futures) ఆధారంగా పనిచేస్తుంది. అంటే, సముద్ర మార్గంలో చ...