8వ వేతన సంఘం: రూ.69 వేల కనీస వేతనం.. ఎన్‌సీ-జేసీఎం భారీ ప్రతిపాదనలు
భారతదేశం, నవంబర్ 10 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల సవరణకు సంబంధించి ఉద్యోగుల ప్రధాన సంఘం 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ' (ఎన్‌సీ-జేసీఎం) 8వ వేతన సంఘానికి కీలక విన్నపాలు సమర్పించింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ఏకంగా రూ.69,000కు పెంచడంతో పాటు పెన్షన్, ఇంక్రిమెంట్లు, అలవెన్సుల్లో విప్లవాత్మక మార్పులు చేయాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన సంఘం ఏర్పాటైన 18 నెలల్లోగా తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో సంప్రదింపులు పూర్తయిన తర్వాతే ఈ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.