భారతదేశం, అక్టోబర్ 10 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. అక్టోబర్ 8న బెంగళూరులో కీలక సమావేశాన్ని ముగించుకున్న 8వ పే కమిషన్, అక్టోబర్ 22 నుంచి ముంబైలో సర్వీసు సంఘాలతో తదుపరి భేటీలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో జీతాల సవరణ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ద్రవ్యోల్బణ ప్రభావం వంటి పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) పే కమిషన్‌కు సమర్పించిన నివేదిక ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అందరి ఉద్యోగులకూ ఒకే రకమైన (యునిఫామ్) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేయడం సరికాదని ఐఆర్‌టీఎస్‌ఏ వాదిస్తోంది. ఉద్యోగుల హోదా, సాంకేతిక నైపుణ్యాలు, బాధ్యతల సంక్లిష్టత, భద్రతా విధులను ప్రాతిపదికగా తీసుకుని 'గ్రేడెడ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అమలు చేయాలన...