భారతదేశం, నవంబర్ 27 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, భత్యాలను సమీక్షించేందుకు 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) కసరత్తు చేస్తున్న వేళ, పెన్షనర్ల సంఘం రంగంలోకి దిగింది. 2026 జనవరికి ముందు పదవీ విరమణ చేసిన వారినీ వేతన సంఘం విధివిధానాల (టీఓఆర్) పరిధిలోకి చేర్చాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

కేంద్ర ప్రభుత్వం, రైల్వే, రక్షణ, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, బ్యాంకు, స్వయంప్రతిపత్తి సంస్థల పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల ప్రయోజనాల కోసం 'ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్' (ఎఫ్‌సీపీఏ) నవంబర్ 25న ప్రధానికి వినతిపత్రం సమర్పించింది. పెన్షన్ సవరణ, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వైద్య సదుపాయాలకు సంబంధించిన 11 ప్రధాన డిమాండ్లను అందులో పొందుపరిచింది.

సాధారణంగా దశాబ్దానికి ఒకసారి వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. అయితే 2026 జనవ...