భారతదేశం, నవంబర్ 28 -- 8వ వేతన సంఘం సిఫార్సుల అమలును 2028 వరకు వాయిదా వేస్తే ప్రభుత్వ ఆర్థిక స్థితికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. కానీ వేతన బకాయిలు పేరుకుపోయి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ వేతన సవరణ వల్ల కేంద్ర ప్రభుత్వ వ్యయం కనీసం రూ.3 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది.

సాధారణంగా పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించడానికి వేతన సంఘాలను ఏర్పాటు చేస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై27), 2027-28 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై28) వేతన సవరణల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలపై ఆర్థిక సంస్థలు ప్రత్యేకంగా లెక్కలు కడుతున్నాయి.

8వ వేతన సంఘం వల్ల కనీసం ...