భారతదేశం, మే 12 -- తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, 'దళపతి' విజయ్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన మద్యం దుకాణాలపై ఆయన కొరడా ఝుళిపించారు. ముఖ్యంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్ల పరిసరాల్లో ఉన్న 717 మద్యం రిటైల్ దుకాణాలను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

తమిళనాడు సమాచార, పౌర సంబంధాల శాఖ (DIPR) వెల్లడించిన వివరాల ప్రకారం.. పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యాసంస్థలు, గుళ్లు, మసీదులు, చర్చీల వంటి ప్రార్థనా స్థలాలు, రద్దీగా ఉండే బస్టాండ్ల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న...