భారతదేశం, ఫిబ్రవరి 16 -- భారత ఆటోమొబైల్ మార్కెట్​లో 7-సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా, విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఏడాది, అలాగే వచ్చే ఏడాది భారీగా కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్, రెనాల్ట్​ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాము..

1. ఎంజీ మెజెస్టర్

ఎంజీ మోటార్స్ తన కొత్త లగ్జరీ ఎస్‌యూవీ 'మెజెస్టర్'ను తాజాగా ఆవిష్కరించింది. గ్లోస్టర్ మోడల్​ కంటే ఇది ప్రీమియం వెర్షన్‌గా రాబోతోంది. వచ్చే నెలలో దీని ధరలను ప్రకటించి, ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు.

ఇంజిన్: ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్లు: ...