భారతదేశం, ఆగస్టు 10 -- కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బహిర్గతం చేశారు. 56 ఏళ్ల వయసులోనూ ఆయనంత శారీరకంగా దృఢంగా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యువత, విద్యార్థులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) కార్యక్రమంలో తన వర్కౌట్ దినచర్యపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "విద్యార్థులు, జెన్ జీ యూత్.. నన్ను ఏమైనా అడగండి, వీలైనన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా" అని కోరడంతో ఒక నెటిజన్ ఆయన ఫిట్‌నెస్ దినచర్య గురించి ప్రశ్నించారు.

ఫిట్‌నెస్‌ సాధించడానికి ఏదో ఒక ప్రత్యేకమైన వర్కౌట్ ప్లాన్ ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ చెప్పారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే అసలైన రహస్యమని స్పష్టం చేశారు.

"ఫిట్‌నెస్ విషయంలో మనం అనుసరించే వర్కౌట్ రకం కంటే, దానిని నిలకడగా, నిరంతరం చేయడం...