భారతదేశం, నవంబర్ 11 -- వివాహిత వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు జప్తు చేయకూడదనే నిబంధన ఉనికిలో ఉన్నప్పటికీ, ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) విచారణలో మాత్రం ఆ ఆభరణాలు ఎలా వచ్చాయో కచ్చితంగా ఆధారాలు చూపించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీడీటీ (CBDT) మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ప్రెస్ రిలీజ్‌లు చూపించి, చట్టబద్ధమైన విచారణ నుంచి తప్పించుకోవడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ తీర్పుతో సాధారణ గృహస్థులు, పసిడి ప్రియులలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? ఐటీ జప్తు మినహాయింపులకు, ఆదాయ ఆధారాలు చూపడానికి ఉన్న తేడా ఏమిటో న్యాయ నిపుణులు కూలంకషంగా వివరించారు.

బీహార్‌కు చెందిన ఫుల్‌పారీ కుమారి, ఆమె భర్తపై 2015 మే 11న బీహార్ విజిలెన్స్ పోల...