భారతదేశం, అక్టోబర్ 30 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) కేంద్రం ఇటీవలే పెంచిన సంగతి తెలిసిందే. ఏడో వేతన సంఘం (7th CPC) పరిధిలోని ఉద్యోగుల డీఏను 60 శాతం నుంచి 63 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంకా పాత వేతన సంఘాల (5, 6వ సీపీసీ) కింద వేతనాలు పొందుతున్న వారికి సైతం కేంద్ర ఆర్థిక శాఖ తీపికబురు అందించింది. వీరి డీఏను భారీగా సవరిస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అక్టోబర్ 29న అధికారిక మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ జూలై 1, 2026 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుందో వివరంగా చూద్దాం.

ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 6వ కేంద్ర వేతన సంఘం నిబంధనల మేరకు ఇంకా పాత పే స్కేల్ లేదా గ్రేడ్ పే కింద వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల కరువు భత...