భారతదేశం, సెప్టెంబర్ 15 -- 418 Postponed: స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418 ది మూవీ' విడుదల ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఈ 418 సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేయడానికి వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఇటీవలే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం మేకర్స్ ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్, షాకింగ్ విజువల్స్ చూసి వారు ఫిదా అయిపోయారు.

కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా, హిందీలో కూడా ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గ...