భారతదేశం, ఆగస్టు 11 -- నిషేధిత సీపీఐ (మావోయిస్టు) రహిత దిశగా అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉంటూ నగర ప్రాంతాల్లో మహిళా విభాగాలు, ఇంటెలిజెన్స్, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకురాలు కాకరాల సమత అలియాస్ మాధవి సోమవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈ మేరకు తెలంగాణ డిజిపి సి.వి. ఆనంద్ నేతృత్వంలో ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, స్టేట్ కమిటీ మెంబర్ (SCM) స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమత లొంగుబాటు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పోలీసులు వెల్లడించారు.

కాకరాల సమత స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ నటుడు. ఆయన 1960లోనే రాజమహేంద్రవరం నుంచి...