40 ఏళ్లుగా పరారీలో ఉన్న జీవిత ఖైదీ - ఆపై ప్రభుత్వ టీచర్ గా రిటైర్..! తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!
భారతదేశం, ఆగస్టు 27 -- పెరోల్ మీద బయటకు వచ్చి, జైలు అధికారుల కళ్లు గప్పి ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు సమాజంలో స్వేచ్ఛగా జీవించాడు. అంతేకాకుండా.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ప్రశాంతంగా రిటైర్ అయిన ఒక హత్య కేసు దోషి ఉదంతం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు జైలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. దోషి భార్య దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
కేసు రికార్డుల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంపతాలపల్లికి చెందిన వీరన్న 1983లో ఓ హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలులో ఉన్న ఆయనకు 1983 డిసెంబర్ 17న 30 రోజుల పాటు అధికారులు పెరోల్ మంజూరు చేశారు. ఆ తర్వాత ఆ వ్యవధిని 1984 మార్చి 17 వరకు పొడిగించారు. నియమం ప్రకారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.