భారతదేశం, జూన్ 11 -- Telugu Heroine Ayesha Khan On Rs.370 Biryani Controversy: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు నవ్వుల కోసం చేసే కొన్ని పనులు ఒక్కోసారి ఎంతటి తీవ్ర వివాదాలకు దారితీస్తాయో చెప్పడానికి తాజా '370 రూపాయల బిర్యానీ వివాదం' ఒక ఉదాహరణ. గురుగ్రావ్‌లో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

మహిళల పట్ల మగవారిలో ఉన్న అనాగరిక ఆలోచనలను, 'సమ్మతి' (Consent) అనే ప్రాథమిక సూత్రాన్ని కించపరిచేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే, సదరు కమెడియన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది.

ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే గురుగ్రామ్‌లో ఒక షో నిర్వహించారు. స్టాండప్ కామెడీలో భాగంగా స్టేజ్ మీదున్న కమెడియన్లు ఆడియన్స్‌తో మాట్...